jump to navigation

Micro$oft పై మన ప్రభుత్వ ప్రేమ జూన్ 14, 2008

Posted by kasyap in Uncategorized.
1 comment so far

22,00,00,000 అనగా ఇరవై రోండు కోట్లరూపాయలు మన ప్రభుత్వం శ్రీశ్రీశ్రీ  Micro$oft వారికి చెల్లింస్తుందట రాష్ట్రంలోని ఐదువేల ఉన్నత పాఠశాలల్లో చేపట్టబోయే కంప్యూటర్‌ విద్య కోసం ఒక్కో బడికి రూ.44వేల విలువైన సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేయనున్నారు. మైక్రోసాఫ్ట్‌ కార్పొరేషన్‌ (ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరపున ఆరంజ్‌ బైట్స్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఈ సాఫ్ట్‌వేర్‌ను అందజేస్తుంది.అంతర్జాలంలో ఉచితంగా లభించే ఉపకరణాల సహాయంతో ఒక రెండు వందల మందితో చేసుకోనే ఉపకరణాలకు బదులు గా ఈ MNC కంపెనీ లను మేపటమెందుకు ?
ఒక ఆలోచన .

“200 మంది కంప్యూటర్ నిపుణులు కావలేను”
ఆ.ప్ర ప్రభుత్వం ,జీతం 5- 15 వేలు, Qul : BCA,BSc,BE,MSC,ME, MCA with Computer scince” Fee : 1000/- for ST,BC,SC 500/-, exp : 0 - 7 years”
దీని వచ్హే కనీన ధరకాస్థులు  2,00,000 వచ్హేసోమ్ము సుమారు 15 కోట్ల రూపాయలు ఇందులో ఖర్చులు, రోండు వందల మందిజీతాలు  రెండు సంవత్సరాలకు 5 కోట్లు మిగులు 10 కోట్లు . మన ప్రభుత్వం పెట్టాలనుకోన్న  ఖర్చు ఇరవై రోండు కోట్లరూపాయలు. ఇది కాక ట్రైనింగ్ కంపెనీ కి ముట్టజెప్పే 50 కోట్లు …..

దశావతారం - తమిళ్ జూన్ 13, 2008

Posted by kasyap in Uncategorized.
add a comment

చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కమల్‌హసన్ పది విభిన్న పాత్రల్లో నటించిన చిత్రం దశావతారం.అందులోనూ రజనీ ‘శివాజీ’ తర్వాత అత్యంత వ్యయం (65  కోట్లుతో) నిర్మించిన కావటంతో అందరి కళ్ళూ దీని పైనే ఉన్నాయి. దాంతో దశావతారం లో ప్రతీ చిన్న విషయమూ సంచలనమవుతోంది.

avataaram

 

 

ఇంత ప్రసిద్దిగాంచిన సినిమాని మోదటి షో చూడటానికి 9:00 గంటలకే  IMAX కు వెళ్ళితే టిక్కట్లనీ అన్నీ సోమవారం దాకా అయిపోయాయని తెలిసింది  నిరాశ గా వెనుతిరుగు తుంటే కమల్ హానన్  ఒక తమిళ యవకుడి రూపం లో వచ్హి ఒక టిక్కేట్టు ప్రసాదించాడు.

తమిళ భాష అయుతే  నేమిటి “యనక్కు  తమిళ్ళ్ తెరియం” కదా అనుకోంటూ  IMAX  హాలులో అడుగు పెట్టా ను  అప్పటి కే బోమ్మ మోదలు పెట్టి 10 నిమిషాలు అయినది. మానవాళి భవితను సర్వనాశనం చేసే బయో వైరస్‌ను యాక్టివేట్‌ కాకుండా ఎలా నిరోధించారనే థీమ్‌ చుట్టూ కథ నడుస్తుంది. వైష్ణవ బ్రాహ్మణుడు రంగరాజన్‌ నంబి, అమెరికా సైంటిస్ట్‌ గోవిందు, అమెరకన్‌ టెర్రరిస్టు ఫ్లెచర్‌, తెలుగు సెక్యూరిటీ ఆఫీసర్‌ బలరామ్‌ నాడార్‌, జపనీస్‌ ఫైటర్‌, మానసిక వ్యాధితో బాధపడే వృద్ధురాలు కామాక్షి, పంజాబీ గజల్‌ గాయకుడు అవతార్‌ సిం,దళిత నాయకుడు పుణ్యకోణి, ముస్లిం యువకుడు కరీముల్లా, అమెరికా ప్రెసిడెంట్‌ జార్జి బుష్‌ .
అమెరికా ప్రెసిడెంట్‌ జార్జి బుష్‌, భారత ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కరుణానిధి హాజరైన వేదిక నుంచి సైంటిస్ట్‌్‌ అయిన కమల్‌హాసన్‌ చేసే ప్రసంగంతో కథకు అంకురార్పణ జరిగింది. విశ్వంలో జరిగే ప్రతి విపత్తుకూ ఒక థియరీ ఉందనీ చెబుతుండగానే కథ 12వ శతాబ్దంలోకి జారుతుంది. శైవ-వైష్ణవుల మధ్య ఆధిపత్య పోరు జరుగుతున్న తరుణంలో శైవుడైన 2వ కుళోత్తుంగ చోళుడు వైష్ణవ మతంపై కన్నెర చేస్తాడు. చిదంబరంలోని భారీ వైష్ణవ విగ్రహాన్ని విధ్వసం చేసేందుకు అతని సైన్యం సిద్ధమయినప్పుడు వైష్ణవ భక్తుడు రంగరాజ నంబియార్‌ వారిని ఎదురిస్తాడు. దాంతో అతన్ని బంధిస్తారు. పంచాక్షరి జపిస్తే వదిలి వేస్తామని కుళోత్తుంగ చోళుడు పెట్టిన షరతును రంగరాజు లెక్కచేయడు. దాంతో చోళరాజు ఆ విగ్రహానికి రంగరాజును కట్టి నదిలో పారేయిస్తాడు. రంగరాజు కథ ముగుస్తుంది. రెండవ అధ్యాయం వాషింగ్టన్‌ ్‌డి.సి.లో మొదలవుతుంది. గోవిందు (కమల్‌హాసన్‌) ఓ ప్రముఖ సైంటిస్ట్‌. అతను తన మేథస్సుతో ప్రపంచ మానవాళిని కబళించే ‘సింథటిక్‌ బయో వెపన్‌’ కనిపెడతాడు. దానిని టెర్రరిస్టులు చేజిక్కించుకునేందుకు ఎ్లాన్‌ చేస్తుంటారు. దాంతో గోవిందు ఆ బయో-వైరస్‌ను ఒక అగ్గిపెట్టి లాంటి బాక్స్‌లో పెట్టి అక్కడ్నించి తరలిస్తాడు. టెర్రరిస్టుల ఎ్లాన్‌ను ఎఫ్‌్‌.బి.ఐ.కి చెప్పే ప్రయత్నంలో ఫ్లెచర్‌ (కమల్‌హాసన్‌) అనే కరడుకట్టిన టెర్రరిస్టు గోవిందు వెంటబడతాడు. ఈ ప్రయత్నంలో బయో-వైరస్‌ బాక్స్‌ నాటకీయంగా గోవిందు చేజారుతుంది. దాన్ని వెదుక్కుంటూ చిదంబరం వరకూ వస్తాడు. అక్కడ లక్ష్మి (ఆసిన్‌) అనే వైష్ణువుల అమ్మాయి పరిచయమవుతుంది. పార్సిల్‌్‌లో అక్కడకు వచ్చిన బయో-వైరస్‌ బాక్స్‌ను లక్ష్మి బామ్మ కామాక్షి (కమల్‌హాసన్‌) గోవిందరాజు విగ్రహంలోకి జారవిడుస్తుంది. ఫ్లెచర్‌, అతని సహచరురాలు (మల్లికా షెరావత్‌) ఆ విషయం కనిపెట్టి చిదంబరం చేరుకుంటారు. దీంతో గోవిందు-లక్ష్మీ కలిసి విగ్రహంతో సహా తప్పించుకుంటారు. వారిని ఫ్లెచర్‌ ఛేజ్‌ చేస్తుంటాడు. మరోవైపు గోవిందును టెర్రరిస్టుగా అనుమానించిన సెక్యూరిటీ ఆఫీసర్‌ (కమల్‌హాసన్‌ తెలుగు ) వెంటపడతాడు. ఈ క్రమంలోనే పాప్‌ గాయకుడు ్‌అవతార్‌సింగ్‌ (కమల్‌), పొడగాడు ముస్లిం యువకుడు కరీముల్లా (కమల్‌), దళిత నాయకుడు పుణ్యకోటి (కమల్‌) వంటి పాత్రలు తారసపడతాయి. చివరకు బయో-వైరస్‌ను దక్కించుకోవాలకున్న ఫ్లెచర్‌  తో ఫైటర్‌ పోరాడి చివరకు ఫ్లెచర్‌ ఆ బయో-వైరస్‌ ను మింగి ప్రాణాలు విడుస్తాడు ఇక ఆ వైరస్ వ్యాప్తి చెందుతుందనుకోన్న తరుణంలో సునామీ వస్తూంది దానిలో వుండే ఉప్పు వలన మానవకోటికి పెనుప్రమాదం తప్పుతుంది. కావున కోన్ని లక్షల మందికి బదులుగా కోన్ని వేలమంది తోనే కధ శుఖాంత మవుతుంది

ఇందులో మోదటి గంట వరకు బాగానే నచ్హింది తరువాత అంతా ఆ విగ్రహం చుట్టూతిరుగుతుంది, కమల్ 10 వేషాలలో 5 వేషాలే5బాగున్నాయి మిగిలిన వి కుదరలేదు ఏదో రబ్బరు ముక్కు బుగ్గలు పెట్టినట్లు వునాయి
చాదస్తపు తెలుగు అధికారిగా కమల్ నటన తమిళ తంబిలకి నచ్హవచ్హు !
ఇక చివరిలో వచ్హ్హే సునామీ గ్రాఫిక్ వర్కులు చాలా పేలవంగా వున్నాయి,ఇక జయలలిత ,కరుణానిది కోన్ని సెకనుల పాటు కనిపిస్తారు.
 కేరళ కుట్టి అసిన్ కు తమిళ ప్రేక్షకులు పాస్ మార్కులు వేస్తారు , మనకు ఆ నటన వెగటుగా అనిపించవచ్హు  
 రజనీ ‘శివాజీ’ లో ఒక పాటలో రజనీ సారు వేసిన విదేశీ గెటప్పులు  దశావతారం గెటప్పుల కన్నా నాణ్యంగా కనిపిస్తాయి . ఇది శివాజీ అంత విజయం సాధిచకపోవచ్హు కానీ ఒక సారి చూడోచ్హు ఇక చివరిలో వచ్హ్హే సునామీ గ్రాఫిక్ వర్కులు చాలా పేలవంగా వున్నాయి,ఇక జయలలిత ,కరుణానిది కోన్ని సెకనుల పాటు కనిపిస్తారు.( ఇక్కడ గ్రాఫిక్స్ బాగానే వాడారు కానీ వీరు / మీడియా చెపుతున్నట్టు అంతర్జాతీయ  స్తాయిలోలేవు )
నాకైతే  కమల్ హాసన్  దశావతారాలు  సరిగా ఎత్తలేదు అనిపించింది.ఎదైనా  మీడియావాళ్ళు సృష్టింనంత దృశ్యంలేదు. హాలు నుండి బయటకు వచ్హేటప్పుడు కాపు గాసిన చానల్ ETV,TV5 , CNBC వాళ్ళతో ఇదేచెప్పా ! బహుశవారికి రుచించకపోవచ్హు !! :)

సిద్దాంతి గారిది వర్జిన్ కాదు ! మే 29, 2008

Posted by kasyap in fun.
Tags: ,
1 comment so far

0996369589 ఈ మోబైలు  సిద్దాంతి గారిది  ఇది  వర్జిన్ మోబైలు నెంబరు  కాదు !

మోన్న నా కజిన్ ఒకరు ఎవరో సిద్దాంతి గారని  ఒక మెబైలు నెంబరు ఇచ్హారు వీరికి మనం ఫోను చేసి మన పేరు వూరు చెప్పాలి . వీరికి మన జన్మదిన తదితర వివరములో పని లెదట, వీరు దేవీఉపాసకులు  వారు చెప్పిన సమయానికి వీరికి మనం మనమే మరల ఫోనుచేసి మన జారతక వివరాలు తెలుసుకోనవలెను .
మనిషి అశాజీవి -  భవిషత్తు తెలుసుకోనే జిజ్ఞాస ఆ రాబోవు పరిమాణాలు ఎలా ఎదుర్కోవాలో , విధిని చేదించేందుకు మానవుడు చేయని ప్రయత్నంలేదు ఈ పయత్నంలో వచ్హిన పరిమాణాలే భవిష్య వాణి,జాతకం, జోతీష్యం ఇంకా అనేక యంత్ర తంత్రాలు ఈ పరిస్తితులు ప్రపంచమంతావున్నాయి వీటి లో వేటి ప్రత్యేకత దానిది   మనలో చాలామంది ఈ విషయాలో ప్రత్యేక ఆశక్తి / ప్రతిభ కనపరుస్తూ వుంటారు .ఇవి కోంత మందికి జీవనాధారం అయితే మరికోంత మందికి అభిలాష / వ్యాపకం అందులోనుంచి పుట్టినదే ఇలాంటి సర్వీసు. మీకు జాతకాల మీద నమ్మకముంటే  ఇలాంటివి ఒక సారి పరీక్షించ వచ్హు ఇందులో చాలా వరకు నిజాలే ఉంటాయి
ఉదా :
మీరు మీ ప్రతిభకు తగిన ఉద్యోగం చేయటంలేదు
మీకు ఎన్నో అవకాశాలు చేతిదాకా వచ్హి వెళ్ళిపోతాయి
మీ నుంచి ఎందరో లాభం పోందుతారు కానీ మీ అవసరానికి సహాయంచేస్తారు
మీకి మీ భార్య తరుపు నుండి కంటే మీ తరుపు వారినినుండే సహాయ సహకారాలు లభిస్తాయి
మీది పదిమందికి పెట్టేచేయ్యేగాని తీసుకోనే చేయికారు
మీ అమ్మ గృహ లక్ష్మీ , నాన్న ప్రజల మనిషి
మీకు నరదిస్టి ఎక్కువ గావున్నది

PS : నిష్పూషి : నేను మోన్నవీరి చేత జాతకం చెప్పించు కోన్నతరువాత ప్రతి ఫలంగా ఈ నెంబరు 11 మందికి ఇవ్వమని చెప్పారు . ఈ సిద్దాంతి గారికో మీ స్వ / వ్యాపార సంప్రదింపులతో నాకు సంబందం లేదు

రామోజీరావుకు సన్ స్ట్రోక్ మే 28, 2008

Posted by kasyap in Uncategorized.
5 comments

హమ్మయ్య  సుమన్‌, ప్రభాకర్ లు ఈ టీవీ నుండి  తప్పుకోన్నారట .
అంటే   ‘నయనానందకర నట విన్యాసం’ చూసే అవకాశం ఇక తెలుగు ప్రేక్షకులకు లేదన్నమాట! :(  పాపం SV  క్రిష్ణారెడ్డి గారిని ఎవరు పిలవాలి ఇక వారు ఎవరిని పోగడాలి? .ఈటీవీ వారు వారికి వారు ఇచ్హుకోనే అవార్దులు ఇకవుండవేమో . ఇక విషయానికి వస్తే  రామోజీ రావుకూ సుమన్‌కూ టీవీ కార్యక్రమాల విషయంలో పదేళ్ల క్రితమే అభిప్రాయభేదాలు వచ్చాయి. అప్పటినుంచీ పెద్దగా మాటలు కూడా లేవు. ఈటీవీలో తన ఇష్టానికి వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎక్కువైన నేపధ్యంలో రామోజీ రావు ఈటీవీ-2 ప్రారంభించి కొడుకు నీడ పడకుండా తనే చూసుకుంటున్నారు. ఈటీవీలో మాత్రం ఇద్దరి కార్యక్రమాలూ ప్రసారమవుతాయి. ఇద్దరి అభిరుచులకూ పొంతన లేకపోవడంతో ఒకరి ప్రోగ్రామ్‌లను మరొకరు వేలెత్తి చూపడం ఎక్కువై తరచూ పరోక్షంగా గొడవలు జరుగుతుండేవి. దీంతో దాదాపు ఆరు నెలల క్రితం ఈటీవీలో తండ్రీ కొడుకులు టైమ్‌ స్లాట్స్‌ పంచుకున్నారు. నం ఎక్కువగా టీవీ చూసే ప్రైమ్‌టైమ్‌ స్లాట్స్‌ సుమన్‌ దక్కించుకున్నారు. తనకు నమ్మిన బంటు అయిన ‘క్రియేటివ్‌ హెడ్‌’ ప్రభాకర్‌ బృందం రూపొందించే ప్రోగ్రామ్స్‌ను మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల దాకా, సాయంత్రం 8 నుంచి రాత్రి 11 గంటలదాకా ప్రసారం చేసేవారు. మిగతా వేళల్లో రామోజీరావు మనుషులు తీసిన కార్యక్రమాలు వస్తాయి. ఈ ’ఒడంబడిక’ ఇలాగే కొనసాగితే ఇబ్బంది ఉండేది కాదేమో కానీ, ఇటీవల తండ్రి స్లాట్స్‌పై తనయుడు కన్నేశారు. వాటిని మార్చే విషయంలో రామోజీ మనుషులకు మార్గదర్శనం చేసే బాధ్యతను ప్రభాకర్‌కు అప్పగించారు. ఆయన వెంటనే రంగంలోకి దిగి ‘క్రియేటివ్‌’ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. దాంతో గొడవ రాజుకుంది. గత గురువారం రామోజీరావుకు విషయం తెలిసి ప్రభాకర్‌ను పిలిచి చీవాట్లు పెట్టారు. దాంతో, ఆయన రాజీనామా చేశారు. అక్కడితో ఆగితే, విషయం బయటికి పొక్కకుండా సర్దుకుపోయేదే కానీ, స్వయానా సుమన్‌ కూడా ’ఎం.డి’ పదవికి రాజీనామా చేశారు.

సుమన్‌ రాజీనామా అయితే చేశారు కానీ, తండ్రిమీద పంతంతో… తన ‘్‌క్రియేటివ్‌ టీమ్‌’ రూపొందించిన కార్యక్రమాల క్యాసెట్స్‌ అందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గత శుక్రవారం కార్యక్రమాల విషయంలో ప్రతిష్టంభన ఏర్పడింది. దాంతో రామోజీ రావు జోక్యం చేసుకొని, సోమాజిగూడలోని ఈటీవీ ఎడిటింగ్‌ విభాగానికి ఫోన్‌ చేసి తక్షణం ’మహిళలు మహరాణులు’, ‘బంధం’, ’పద్మవ్యూహం’ కార్యక్రమాల క్యాసెట్స్‌ పంపించాలని హుకుం జారీ చేశారు. భయపడిన సిబ్బంది వాటిని పపించి ఎందుకైనా మంచిదని సుమన్‌కు విషయం చెప్పారు. ఆయన వాళ్లపై మండిపడి, మార్గమధ్యం నుంచే క్యాసెట్స్‌ను వెనుకకు రప్పించారు. చివరి నిమిషంలో జరిగిన ఈ హఠాత్పరిణామంతో కంగుతిన్న రామోజీ వర్గం గురువారం నాటి కార్యక్రమాలనే శుక్రవారం కూడా ప్రసారం చేయించింది. దీన్ని పరాభవంగా భావించిన రామోజీరావు తన అనుంగు అనుచరుడైన సంస్థ వైస్‌ ప్రెసిడెంట్‌ బాపినీడును రంగంలోకి దింపారు. ఆయన సోమాజిగూడ వెళ్లి ప్రైమ్‌టైమ్‌ ప్రోగ్రామ్‌ల క్యాసెట్‌లను స్వయగా పట్టుకుపోయారు. సుమన్‌ దీన్ని సవాలుగా తీసుకున్నారు. శనివారం మధ్యాహ్నం, ప్రైమ్‌టైమ్‌లో ప్రసారం కావలసిన కార్యక్రమాల క్యాసెట్లు ఫిలింసిటీకి వెళ్లకుండా కట్టుదిట్టం చేశారు. సోమాజిగూడ ఆఫీసును తన విధేయుల పహరాలో ఉంచారు. దాంతో మల్టినేషనల్‌ కంపెనీల స్పాన్సర్‌షిప్‌తో కోట్లు కురిపిస్తున్న ‘స్టార్‌వార్స్‌’, ’యాహూ’ వటి పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి. దీనివల్ల సంస్థకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. అసలే ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ కారణంగా ‘మార్గదర్శి’ సంస్థ వివాదాల్లో చిక్కి ఇబ్బందుల్లో ఉన్న రామోజీ సొంత కొడుకు వల్ల మరో పెద్ద తలనొప్పిని ఎదుర్కోవలసి వచ్చింది.
- చివరికి రామోజీరావుకు సన్  స్ట్రోక్ తప్ప లేదు :(
పూర్తి వివరాలకు www.telugupeople.com చదవగలరు

పుణ్యం - పురుషార్దం ఏప్రియల్ 15, 2008

Posted by kasyap in Uncategorized.
1 comment so far

పుణ్యం  పురుషార్దం . ఈ సారి మీరు ప్రార్దనా  మందిరానిని వెళ్ళినప్పు డు  ఆ కుర్ర పూజారిని  జాగ్రత్త గా చూడండి    బహుశా ఆయన ఎంబిఏ లాంటి పెద్ద చదవునే పూర్తి చేసి, దానికి తగ్గ వృత్తిని గతంలో చేసి ఉండొచ్చు. ఎంతైనా ఆధ్యాత్మికంగా ఏదైనా సలహాలు, సూచనలు ఇస్తే ఇవ్వొచ్చని  మనం  భావిస్తే తప్పులో అడుగేసినట్టే. బిజినెస్‌ / సాంకేతిక  అంశాల తో పాటు ఆధ్యాత్మిక చింతనపై కూడా దృష్టి పెట్టే విధంగా  పలు సలహాలను ఇ్‌వ్వొచ్చు. ఎదం ఎందుకంటే వారు వృత్తిపరం మైన సంపాద న  సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు తో సరి సమానంగా వుంటోంది . మోన్న భద్రాచలం లో   రాములు వారి కళ్యాణ వైభోగం  అందరూ  చూశే వుంటారు కదా అందులో  తలంబ్రాలు పోసేటప్పు డు  పళ్ళాలు అందించే  శ్రీనివాశాచారి నాకు బాల్యస్నేహితుడు B.E Comp ,  M.B.A చదివి కోన్నాళ్ళు బెంగుళ్ళూరు  లో developer గాచేసి  ఇప్పుడు  భద్రాచలం  రామాలయ ప్రాంగణంలో  ఆంజనేయ స్వామి గుళ్ళో పూజారిగా  చేస్తున్నా డు  నెలకు   20,000 పైనే సంపాదన ఇంకా టార్గెట్లు  డెడ్ లైనులు    లేని ఉద్యోగం  :) గౌరవ మర్యాదలు సరే  సరిం  .
ఒక సారి నాతో చెప్పాడు     శ్రీవైష్ణవుల కంటే  వైదిక  బ్రాహ్మణుల  ఆదాయం బాగుంటుందట !

Gmail సౌలబ్యం గురించి ఏప్రియల్ 11, 2008

Posted by kasyap in Uncategorized.
1 comment so far

Gmail సౌలబ్యం  గురించి ఈ రోజే నాకు తెలిసింది   ఈ రోజు   ఒక టపాను నా జీమెయిలు kasyap.p@gmail.com పంపాలనుకోని  పోరపాటున   kasyapp@gmail.com  కు  పంపాను హాచ్హర్యం !! అది   kasyap.p@gmail.com కు  వచ్హింది   పాపం జీమెయిలుకు   ID మద్యలో చుక్కలు , కామాలు పెడితే అర్దం  కాదేమో !   అంతే  కాక మీరు  kasyapp+XYZ@gmail.com  కు పంపినా  కూడా  kasyap.p@gmail.com  కే వస్తుంది .
I am useing gmail from Aug  2004  but ఈ విషయం నాకు ఇంత వరకు తెలవదు   :(

తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది ! ఏప్రియల్ 5, 2008

Posted by kasyap in Uncategorized.
3 comments

బ్లాగు మిత్రులకు, శ్రేయోభిలాషులకు సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు, ఈ సారి ముందుస్తు   ఎందుకంటే   ఈ ఉగాదికి    వూరువెళ్ళాలి

పోయిన  సంవత్సరంలా కాకుండా ఈ సారి తేదీల విషయంలో  తికమక లేదు .
సర్వజిత్   నాజీవితంలో పెను మార్పులకు  దారి తీసినది    గృహస్తాశ్రమం స్వీకరించక తప్పింది  కాదు  ఈ   సర్వధారి నామ సంవత్సరం లో ఎమి  జరుగు తుందొచూడాలి ! ఈ సారి ఉగాది కి కవిత కాకుండా ఒక  పాట 

జీతం ఎక్కడున్నాది  జీతం ఎక్కడున్నాది
ఈ ఖర్చుల్లులో కరుగూతున్నాది
అందమైన జీవితం అనుకుంటున్న వయసులో
అనుకోకుండా పెళ్ళై పోయినాది
బాచ్హిలర్ గ బ్రతిగా ఎంతో  హాయిగ తిరిగా
కోంగుని పట్టి కోట్టుకు పోయానే బ్రతుకూలో  కోంగుని పట్టి కోట్టుకు పోయానే!
(దీని ని   గజిని  సినిమాలోని హృదయం ఎక్కడున్నాది  బాణి / రాగం  లో పాడుకోన వలెను )

ఉగాది శుబాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మరింత ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ
మీ శ్రేయోబిలాషి
కృపాల్ కశ్యప్

 

కోతుల బెడద మార్చి 21, 2008

Posted by kasyap in Uncategorized.
2 comments

ఈ  కోతుల కు  ఎంమయినది ? ఈ మద్య ఈ  కోతులు  అఘాయిత్యాలు మరీ   పెరిగి పోయాయి  .
అస్సలు మనుష్యులంటే  భయ్యం   లేకుండా తెగ రెచ్హి పోతున్నాయి . ఒక సారి  ఈ కోతుల బెడద నుంచి మామిడి తోటను రక్షించు కోవ టానిని  “బచ్హ్హోడు” అనే కోండముచ్హును   కోను కోస్తే ఇది కూడా వీటి బాద నుతట్టు కోలేక చెట్టుకు  ఉరేసుకోన్నది .
మోత్తం  మామిడి తోటంతా   వీటి  దెబ్బకు   ఖతం   వీటి  బెడదకు అసలు కాపలా కాసేనారు  దోరకటంలేదు , గోరు చూట్టు మీద రోకటి పోటు లాగ  ఈ మద్య  వీటి భారి నడి కోంత మంది చనిపోయారట  అంతే   కాక అదేదో  గ్రామంలో  ఇవి  మహిళల   అసబ్యంగా ప్రవర్తిన్నా యని  నిన్న టి.వీ 9 లో చెప్పాడు   అసలు  కోతులు ఇంతగా సైర్విహారం చేస్తుంటే  ప్రభుత్వం ఎంచేస్తో  ందో  .ఈ సారి బడ్జేట్ లో   దీనికి ఎటువంటి   కేటాయింపులు లేవు  ప్రభుత్వం వెంటనే ఒక కోండముచ్హుల శిక్షణా కేంద్రాని ఎర్పాటు చేయాలి  కోతుల భారిన  పడ్డ  తోటల రైతులకి ,ప్రజలకు   కుల,మత వర్గ  తేడాలేకుండా  వెంటనే  ప్యాకేజి   ప్రకటించాలి

నువ్వు కులుకుతూ ఇచ్హెదవు ఎవడబ్బసోమ్మని చిదంబరమా ! మార్చి 1, 2008

Posted by kasyap in Uncategorized.
4 comments

అయ్యో  మేధావి అనుకోన్నానే !, దూరదృస్టి కలవాడను కోన్నానే !!, భారత అర్దికరంగాని పరిపుస్టం చేయగలవాడను అనుకోన్నానే !!!.
మీ చిదంబర రహస్యం   ఇదేనా ఎడాపేడా వరాలు ఇవ్వటమేనా :(
60,000 కోట్లరూపాయలు  మాఫీ దీని బదులు ఎ వడ్డీ  తగ్గించ టమో  ఆసోమ్ముని ని మౌలిక వసతుల కల్పనకో కేటాయించచ్హుకాదా .
పేదలు వెనక బడినవారు  ఇలా  ఎంతకాలం   మా మధ్యతరగతి  వీళ్ళని   భరించాలి ? కుల,మత ప్రాతిపదికన  రాయుతీల సంగతి రాయటానికి వీలులేదు ఇప్ప టికే వేలకు వేలు ఇంజనీరింగ్ నిరుద్యోగులు తయారయ్యారు .
నా  మటుకు నాకు మీ  బడ్జెట్ వలన లాభంలేదు
1)ఈ సారి మాపోలాలు  కౌలుకి ఇచ్హాం  ఒకవేళ  వ్యవసాయంచేసినా నేను మీపరిదిలోకి రాను.
2)మీ  వైద్యశాలలో  ప్రమాణాలు ప్రత్యక్షంగా తెలుసిన వాడిని - నేను వెళ్ళలేను
3)మీరు తగ్గించిన టి.వి,ద్విచక్ర వాహనాలు ఎప్పుడో కోనుకోన్నాను
4)నేను  విద్యార్దిని, వృద్దుడిని   కాను,సహకార వెనక బడిని,మైనారిటీ   వర్గాలకు చెందిన వాడిని కాను .
మీ  కంటితుడుపు  అదాయపన్ను  రుచించలేదు ,మీకు  క్రమం  తప్పక  అదాయపుపన్ను చెల్లించటం నా కర్తవ్యం  అది నాబాద్యత కూడా  -

 కాసే  చేట్టుకే రా ళ్ళదెభ్భలంటే ఇదేనేమో .  ఇప్పుడు వీళ్ళ కి నేతులు పూశారు రేపటి వాతలు మళ్ళీ నాలాంటి వాళ్ళకే :(
 

లీ ప్లింగ్- లీపురోజు ఫిబ్రవరి 29, 2008

Posted by kasyap in Uncategorized.
2 comments

ఈరోజు  లీపురోజు మా  అరుణా టీచరు (5 వ తరగ తి) ,నాస్నేహితురాలు జ్యోతి ,మహోష్  ల పుట్టినరోజు   వీరికి జన్మదిన శుభాకాంక్షలు  నాకు  చిన్నప్పుడు  ఈరోజు పుడితే బాగుడు అనిపించేది :).ఇలాపుట్టిన వారిని  “leapling” అంటారట, 12వ శతాబ్దం లో Scottish  దేశంలో ఈ రోజు  స్త్రీ లు   వివాహనికి  అబ్యర్దస్తే (make a proposal of marriage)ఒక వేళ  ఆ  పురుషుడికి ఇస్టం లేక పోతే ఒక ముద్దు పెట్టి,ఒక  పౌండు  ఇచ్చి ఒక జత గ్లోజులు ఇవ్వాలని  షరతు !.
కానీ ఈ Gregorian calendar,తేదీలు మార్చటం, క్రీస్తుపూర్వం లో తేదీలు వెనకకు వెళ్ళటం, తేదీలు మార్చటం,గంటలు మార్చటం అంతాఅయోమయంగా వుంటుంది . ఈ మద్యఒక దేశాక్షుడు  ప్రజలంతా పోద్దున్నే లేచి చురుకుగా వుండంటందుకు  తమ  దేశకాలాన్ని ఒక గంటముందుకు జరిపాడట !  . ప్రోఫేసర్  స్టీఫేన్ హాకింగ్ (Stephen Hawking )  గారి  Brief History of Time చదివిన తెరువత  చాలా  విచిత్రం అయిన  అలోచనలు వచ్చాయి ఆ సిద్దాతాల  ప్రకారం కాలంలోకి ప్రయాణంచేయవచ్హు ఇది ఎలాగో  ఆ పుస్తకాన్ని చదివిచూడండి .
నాకు మాత్రం  శాలువాహన శకం  శ్రీ సర్వజిత్‌ నామ సంవత్సరం;ఉత్తరాయణం; శిశిర ఋతువు;మాఘ మాసం; కృష్ణ పక్షం  అనుకోవటమే ఇస్టం అయితే ఇందులో కూడా ఎవో అధిక మాసాలని ఉంటాయట !